హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత
NEWS Mar 30,2025 09:15 am
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఉద్రిక్తత కొనసాగుతోంది. యూనివర్శిటీ క్యాంపస్ లో 200 మందికి పైగా పోలీసులు మోహరించారు. 400 ఎకరాల భూములను అమ్మేందుకు తాము ఒప్పుకోమంటూ హెచ్చరించారు. క్లాసులను బహిష్కరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకున్నా పట్టించుకోలేదు. దిష్టిబొమ్మను దహనం చేశారు.