హైదరాబాద్ నగర వాసులకు తీపి కబురు చెప్పారు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. ఉగాది పర్వదినం సందర్బంగా మెట్రో సమయం పొడిగించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు రాత్రి 11 గంటల వరకే అందుబాటులో ఉండగా ఇకపై రాత్రి 11.45 గంటల వరకు పొడిగించినట్లు స్పష్టం చేశారు. ఈ మార్చిన సమయం ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని వెల్లడించారు ఎండీ. కాగా సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమేనని పేర్కొన్నారు. కాగా టెర్మినల్ స్టేషన్ ల నుంచి ఆదివారాల్లో ఉదయం 7 గంటలకు ప్రారంభం కానుంది తొలి రైలు.