మహాదుర్గ అలంకారంలో భ్రమరాంబిక
NEWS Mar 29,2025 07:51 pm
శ్రీశైల పుణ్య క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. ఉగాది మహోత్సవాలలో భాగంగా రెండవ రోజు సాయంత్రం మహాదుర్గ అలంకారంలో దర్శనం ఇచ్చారు శ్రీ భ్రమరాంబిక అమ్మ వారు. అంతకు ముందు శ్రీ మల్లికార్జున స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. లోక కళ్యాణం కోసం జపానుష్టానాలు, రుద్ర హోమం, చండీ హోమం జరిపించారు. అనంతరం కైలాస వాహనంపై అధిరోహించారు స్వామి , అమ్మవార్లు. భక్తులు పారవశ్యంతో దర్శించుకుని నీరాజనాలు అర్పించారు. గ్రామోత్సవంలో దేవస్థానం ఈవో శ్రీనివాసరావు దంపతులు, వేద పండితులు అర్చకులు ,అధికారులు ,అశేష కన్నడ భక్తులు పాల్గొన్నారు.