స్థానిక సంస్థల ఫలితాలపై జగన్ సంతృప్తి
NEWS Mar 29,2025 07:55 am
రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఉపఎన్నికల ఫలితాలపై మాజీ సీఎం జగన్ స్పందించారు. బలం లేకపోయినా, కూటమి ప్రభుత్వం ప్రలోభాలకు గురి చేసినా, కేసులు పెట్టినా, బెదిరించినా వైసీపీ ఎంపీటీసీలు, జడ్పీ టీసీలు ధైర్యంగా నిలబడి వైసీపీ అభ్యర్థులను గెలిపించుకున్నారని ప్రశంసించారు . క్లిష్ట సమయంలో మీరు చూపించిన ధైర్యం పార్టీకి మరింత ఉత్తేజాన్ని ఇచ్చిందన్నారు. పార్టీకి అప్పుడు, ఇప్పుడు, ఎల్లప్పుడు వెన్నెముకలా నిలుస్తున్న కార్యకర్తలకు హ్యాట్యాఫ్ అని అన్నారు. ఇదే స్పూర్తి రాబోయే ఎన్నికల్లో కూడా ఉండాలన్నారు.