ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు
NEWS Mar 29,2025 01:47 am
ప్రభుత్వ భూముల పరిరక్షణకు హైడ్రా చర్యలు తీసుకుంటోందన్నారు కమిషనర్ ఏవీ రంగనాథ్. ప్రభుత్వ భూముల కబ్జా జరుగుతున్నట్టు వస్తున్న ఫిర్యాదులపై తాను క్షేత్ర స్థాయి పర్యటన చేపట్టానని అన్నారు. మాదాపూర్ లోని గుట్టల బేగంపేట, ఫిలింనగర్ బస్తీ విష్పర్ వ్యాలీ చేరువగా వున్న చెరువు, శంషాబాద్ మండలంలోని తొండపల్లి గ్రామం, కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం గ్రామం లో ప్రభుత్వ భూములను కమిషనర్ పరిశీలించారు.ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూస్తామన్నారు. రహదారులకు ఆటంకం లేకుండా చుట్టూ ఫెన్సింగ్ వేయడం, ప్రహరీలు నిర్మించి కాపాడుతామన్నారు .