దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు
NEWS Mar 29,2025 12:25 am
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రేషన్ కార్డు అనేది ఒక ఐడెంటిటీ గా ఉంటుందన్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రేషన్ కార్డులు ఇవ్వ లేదని ఆరోపించారు. త్వరలో 3 రకాల కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామని ప్రకటించారు. దరఖాస్తు చేసుకున్న అందరికీ రేషన్ కార్డులు ఇస్తామని స్పష్టం చేశారు. ఉగాది పండుగ సందర్బంగా రాష్ట్ర మంతటా సన్న బియ్యం పంపిణీ చేస్తామన్నారు. వీటితో పాటు సరుకులు కూడా ఇస్తామన్నారు.