మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై కేసులు పెట్టి జైలుకు పంపించడం తనకు బాధ కలిగించిందన్నారు. బాబు అరెస్ట్ ను ఆనాడు కేసీఆర్ ఖండించ లేదన్నారు. జగన్ రెడ్డి దుర్మార్గంగా వ్యవహరించారని ఆరోపించారు. చంద్రబాబు జైలు నుంచి విడుదల కావాలని పోరాటాలు చేశామన్నారు. ఆయన కోసమే ఆనాడు బీఆర్ఎస్ పార్టీని వీడాల్సి వచ్చిందని చెప్పారు. నా రాజకీయ భవిష్యత్తును త్యాగం చేశానన్నారు. రేవంత్ రెడ్డికి గనుక స్వేచ్ఛ ఇవ్వక పోతే కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం జరుగుతుందన్నారు.