మ్యాచ్ టికెట్లు ఇవాళ కూడా అంతే..
NEWS Mar 28,2025 01:23 pm
క్రికెట్ అభిమానుల క్రేజీనెస్‌ను బాగా సొమ్ము చేసుకుంటోంది జోమాటో వారి డిస్ట్రిక్ట్ యాప్. ఏప్రిల్ 6 ఆదివారం, సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటన్స్ మధ్య జరగబోయే మ్యాచ్ టికెట్లను ఇవాళ సాయంత్రం 5 గంటలకు తమ యాప్‌లో రిలీజ్ చేసింది. ఐతే సరిగ్గా 5 గంటలకు యాప్‌లో ఎంటరైన వాళ్లు దాదాపు అరగంట, గంటకు పైగా వేచిచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత 6 వేల మంది క్యూలో ఉన్నారు, 4 వేల మంది క్యూలో ఉన్నారంటూ కౌంట్‌డౌన్ పెట్టడం.. ఆ కౌంట్‌డౌన్ అయిపోయే లోపే 750 రూపాయల టికెట్లు సోల్డవుట్ అని పెట్టేసింది. ఎక్కువ రేటు ఉన్న టికెట్లను మాత్రం కాసేపు ఉంచి..అవి కూడా క్షణాల వ్యవధిలో సోల్డవుట్ అని పెట్టింది. ఇలా ఐతే ఎలా అంటూ అభిమానులు వాపోతున్నారు.