కోటికి పైగా విలువైన గంజాయి దహనం
NEWS Mar 28,2025 06:16 pm
మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా సీజ్ చేసిన ఒక కోటి 28 లక్షల 29 వేల 400 రూపాయల (1,28,29,400/-) విలువైన 513 కిలోల 176 గ్రాముల గంజాయిని జిల్లా పోలీసులు ధ్వంసం చేశారు. కాకతీయ మెడిక్లీన్ ఏజెన్సీ, ఊర్సుగుట్ట, హన్మకొండలో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS మరియు మాదక ద్రవ్యాల నిరోధక శాఖ ఆదేశాలమేరకు డ్రగ్ డిస్పోసల్ కమిటీ సభ్యుల సమక్షంలో గంజాయి దహనం జరిగింది. ఈ కార్యక్రమంలో డిఎస్పీ గండ్రతి మోహన్,టౌన్ డిఎస్పీ తిరుపతి రావు, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, గూడూరు సీఐ సూర్య ప్రకాష్, మహబూబాబాద్ టౌన్ సీఐ దేవేందర్,మరిపెడ సీఐ రాజకుమార్, అధికారులు పాల్గొన్నారు.