గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కోలుకోలేని షాక్ తగిలింది. టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వంశీ రిమాండ్‌ను సీఐడీ కోర్టు ఏప్రిల్ 9 వరకు పొడిగించింది. కాగా ఈ కేసుకు సంబంధించి నేటితో రిమాండ్ ముగియడంతో వంశీని ఈ రోజు ఉదయం జిల్లా జైలు నుంచి గన్నవరం పోలీసులు కోర్టుకు తీసుకొచ్చారు. వంశీతో పాటు నిమ్మ లక్ష్మీపతిని కూడా పోలీసులు ప్రత్యక్షంగా కోర్టులో హాజరు పరిచారు. సీఐడీ కోర్టు రిమాండ్‌ను పొడిగించడంతో ఆయనను విజయవాడ జైలుకు తరలించారు. మరోవైపు సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో వంశీ రిమాండ్ ఖైదీగా విజయవాడ జిల్లా జైలులో ఉన్న సంగతి తెలిసిందే.