NRPT: మాగనూరు మండల పరిధిలోని నల్లగట్టు మారెమ్మ దేవాలయ పరిసర ప్రాంతాలలో మైనింగ్ మాఫియా కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇష్టానుసారంగా బ్లాస్టింగ్ జరుగుతుండడంతో రాళ్లు ఎగిరి పంట పొలాల్లో, తమ ఇండ్ల మీద పడి ఇండ్లు పూర్తిగా శిథిలమవుతున్నాయని ఆరోపిస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.