శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.36 కోట్లు
NEWS Mar 28,2025 10:23 am
తిరుమల పుణ్య క్షేత్రం భక్త బాంధవులతో రద్దీగా ఉంది. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 64 వేల 279 మంది భక్తులు దర్శించుకున్నారు. 24 వేల 482 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.36 కోట్లు వచ్చినట్లు తెలిపారు ఈవో జె. శ్యామల రావు. స్వామి వారి దర్శనం కోసం ప్రస్తుతం 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు కనీసం 18 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.