ప్లాస్టిక్ వద్దు పర్యావరణం ముద్దు
NEWS Mar 28,2025 10:19 am
ప్లాస్టిక్ ను వాడ వద్దని, ఇది పర్యావరణానికి ముప్పుగా మారనుందని అన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ప్లాస్టిక్ వినియోగం ప్రమాద ఘంటికలు అనే పుస్తకాన్ని తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన కల్పించడం జరుగుతోందన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు సీఎం. దీనిపై ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే హైడ్రా రంగంలోకి దిగిందని, జీహెచ్ఎంసీ ప్లాస్టిక్ వినియోగంపై యుద్దం చేస్తోందన్నారు. ఈ సందర్బంగా మండలి చైర్మన్, స్పీకర్, సీఎం, డిప్యూటీ సీఎంలకు స్టీల్ టిఫిన్ బాక్సు అందశారు మంత్రి కొండా సురేఖ.