తెలంగాణ శ్రీలంక లాగా మారడం ఖాయం
NEWS Mar 28,2025 10:16 am
బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ సర్కార్ పై భగ్గుమన్నారు. ఇదే సమయంలో గత 10 ఏళ్ల పాలనా కాలంలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత బీఆర్ఎస్ కే దక్కుతుందన్నారు. బీఆర్‌ఎస్ అరాచకం, విధ్వంసం కారణంగానే రాష్ట్రానికి 8 లక్షల కోట్లకు పైగా అప్పు అయ్యిందన్నారు. ఇది ఎవరి కోసం, ఎందు కోసం చేశారో చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. ఇందుకు సంబంధించి మొదటి ముద్దాయి బీఆర్ఎస్సేనని ఆరోపించారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. రాను రాను అప్పులు తగ్గించుకోక పోతే తెలంగాణ రాష్ట్రం మరో శ్రీలంక, వెనిజులా లాగా తయారు కావడం ఖాయమని హెచ్చరించారు.