అసెంబ్లీ సాక్షిగా సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టారు. ప్రధానంగా ఆయన రాష్ట్రంలో పని చేస్తున్న ఐఏఎస్ ఆఫీసర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్ల వల్ల ప్రజలకు ఒరిగింది ఏమీ లేదన్నారు. ఒక్కో ఐఏఎస్ కు మూడు కార్లు ఎందుకు కేటాయించారంటూ ప్రశ్నించారు. వాటిని ఒకటికి తగ్గిస్తే నెలకు రూ. 150 కోట్ల రూపాయలు మిగులుతాయని అన్నారు ఎమ్మెల్యే. ఈ మధ్యనే స్మితా సబర్వాల్ ఏకంగా గత బీఆర్ఎస్ హయాంలో రూ. 60 లక్షలు బిల్లులు చెల్లించడం వెలుగు చూసిందని , ఇది దారుణమన్నారు. వెంటనే విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.