రేవంత్ తిట్లు మాకు దీవెనలు
NEWS Mar 27,2025 06:15 pm
అసెంబ్లీ సాక్షిగా మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఎంత ఎక్కువగా మాట్లాడితే, తిట్లు తిడితే తమకు అంత మంచిదని అన్నారు. ఆయన తిట్లే మాకు దీవెనలంటూ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి తిట్ల వల్ల ఇంకో 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలంటే భయపడే పరిస్థితి రాష్ట్రంలో వచ్చిందన్నారు. మహారాష్ట్రలో, హర్యానాలో, ఢిల్లీలో వెళ్లి ఎన్నికల ప్రచారాలు చేశాడు అక్కడ వర్కవుట్ కాలేదంటూ ఎద్దేవా చేశారు.