అంజన్నను దర్శించుకున్న బీసీ కమీషన్ చైర్మన్
NEWS Mar 27,2025 06:15 pm
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామిని రాష్ట్ర బీసీ కమీషన్ చైర్మన్ నిరంజన్, బీసీ కమిషన్ సభ్యులు జయప్రకాష్, సురేందర్, బాలలక్ష్మి గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన వారికి ఆలయ అర్చకులు, సిబ్బంది స్వాగతం పలికి ఆశీర్వచనం అందించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. వారి వెంట ఆర్డీవో మధుసూదన్ గౌడ్, డీపీవో, మల్యాల తహసీల్దార్, అధికారులు పాల్గొన్నారు.