యూనివర్శిటీలో ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేయాలి
NEWS Mar 27,2025 06:19 pm
మంజూరైన ఇంజనీరింగ్, కాలేజీలను హుష్నాబాద్ కు తరలించే యోచన విరమించు కోవాలని ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మల్యాల రాకేష్, విభాగ్ కన్వీనర్ అజయ్ డిమాండ్ చేశారు. అధికారులు చర్యలు తీసుకోవడం సరికాదన్నారు. కాలేజీలను శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని కరీంనగర్ లోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.