పాస్టర్ ప్రవీణ్ మృతిపై అనుమానం
NEWS Mar 27,2025 04:34 pm
మాజీ ఎంపీ హర్ష కుమార్ నిప్పులు చెరిగారు. పాస్టర్ ప్రవీణ్ హత్యపై అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఇది రోడ్డు ప్రమాదం కాదని, హత్య అని ఆరోపించారు. ఈ విషయాన్ని పోలీసులకు కూడా చెప్పామన్నారు. ఈ కేసులో పోలీసులు నిజాలు తేల్చడం లేదన్నారు. ప్రవీణ్ ది ముమ్మాటికి హత్యేనని పోలీసులకు తెలుసన్నారు. వైద్యులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, నివేదిక ఇవ్వాలన్నారు. తేడా వస్తే రీ పోస్టుమార్టం చేయిస్తానని వార్నింగ్ ఇచ్చారు హర్ష కుమార్.