నీటిని వృథా చేయవద్దు - కమిషనర్
NEWS Mar 27,2025 04:37 pm
మెట్ పల్లి పట్టణం లోని వాటర్ సప్లై పైపు లీకేజీ పనులను పుర కమిషనర్ మోహన్ పరిశీలించారు. ఈ సందర్భంగా వేసవి కాలం దృష్ట్యా ప్రజలు నల్ల నీటిని వృథా చేయవద్దని , భగీరథ పైప్ లైన్కు ఆన్, ఆఫ్ నల్లాలను బిగించు కోవాలన్నారు. వృథాగా రోడ్లపై వదిలిపెడితే నల్ల కనెక్షన్ ను తొలగించాలని సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. కార్యక్రమంలో రత్నాకర్, విష్ణు, ముజీబ్, నర్సయ్య తదితరులు ఉన్నారు.