విడదల రజిని దావా విచారణ వాయిదా
NEWS Mar 27,2025 01:36 pm
మాజీ మంత్రి విడదల రజిని ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇవాళ కోర్టు విచారణ వాయిదా వేసింది. ఏసీబీ అధికారులు తనపై కేసు నమోదు చేశారు. దీనిపై రజిని కోర్టును ఆశ్రయించారు. తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని దావాలో కోరారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఏప్రిల్ 2వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. రజినిని ఏ1గా చేర్చారు. ఆమెతో పాటు ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, నటుడు పోసాని కృష్ణ మురళి, పేర్ని నాని, కాకాణి గోవర్దన్ రెడ్డిలపై కేసులు నమోదయ్యాయి.