కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ప్రభుత్వ వేలం ప్రక్రియను వెంటనే ఆపాలని కోరారు. రంగారెడ్డి జిల్లా కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిని వేలం వేయడాన్ని ఆయన తప్పు పట్టారు. వనరుల పేరిట పర్యావరణాన్ని నాశనం చేయవద్దని సూచించారు. ఆ ప్రాంతాన్ని జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని కోరారు. జీవ వైవిధ్యంతో కూడిన ప్రాంతాన్ని కాంక్రీట్ జంగిల్లా మార్చడం మంచి పద్దతి కాదన్నారు.