నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంటలో ఎస్ఎల్బీసీ టన్నెల్ లో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు ఎనిమిది మంది కార్మికులు మృతి చెందగా రెండు మృత దేహాలు మాత్రమే లభించాయి. ఇంకా ఆరు మృత దేహాలను వెలికి తీసేందుకు ఆపరేషన్ జరుగుతోంది. గత 33 రోజులుగా ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. చివరి 20 మీటర్లు డేంజర్ జోన్‌గా గుర్తించి బురద తొలగిస్తున్నారు. సిబ్బంది. సహాయక చర్యలను పరిశీలిస్తున్నారు రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కార్యదర్శి అరవింద్ కుమార్, ఆర్మీ కల్నల్ పరీక్షిత్ మెహ్రా.