ఏపీ సర్కార్ తీపి కబురు చెప్పింది. లులు గ్రూప్ నకు క్లియరెన్స్ ఇస్తున్నట్లు ప్రకటించింది. వైసీపీ హయాంలో వెనక్కి వెళ్లిపోయింది లులు గ్రూప్ . కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జనవరిలో చంద్రబాబును కలిశారు లులు గ్రూప్ చైర్మన్. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషనల్ బోర్డులో మళ్లీ నిర్ణయం తీసుకున్నారు. గతంలో కేటాయించిన 13.83 ఎకరాలను తిరిగి కేటాయిస్తూ జీవో జారీ చేశారు. లులు గ్రూప్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోయే మాల్ ద్వారా ఉపాధి కల్పన జరగనుంది.