మాజీ మంత్రి హరీశ్ రావుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. పదేళ్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న మీకు సభలో ఫోటోలు తీయడం నిబంధనలకు విరుద్ధమని తెలియదా అంటూ ఫైర్ అయ్యారు. వెంటనే తీసిన ఫోటోలను డిలీట్ చేయాలని ఆదేశించారు. ఇది మంచి పద్దతి కాదంటూ హితవు పలికారు. కాగా ఓ వైపు సభాపతి చెబుతున్నా వినిపించుకోకుండా హరీశ్ రావు అదే పనిగా ఫోటోలు తీయడం మొదలు పెట్టారు. దీనిని గమనించిన స్పీకర్ సీరియస్ అయ్యారు.