ప్రవీణ్ పగడాలది రోడ్డు ప్రమాదం కాదు
NEWS Mar 27,2025 09:22 am
ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. పాస్టర్ ప్రవీణ్ పగడాలది రోడ్డు ప్రమాదం కాదన్నారు. సంఘటన స్థలంలో ఇది హత్య అనేందుకు చాలా రుజువులు ఉన్నాయని పేర్కొన్నారు. ఇది పక్కా ప్లాన్ తో చేసిన హత్యేనని , కుటుంబ సభ్యులతో సహా ప్రతి ఒక్కరికీ అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఈ దారుణ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవుల మనోభావాలను తీవ్రంగా దెబ్బ తీసిందన్నారు. రాష్ట్ర సర్కార్ ప్రవీణ్ పగడాల మృతిపై వెంటనే ఫాస్ట్ ట్రాక్ విచారణ జరిపించాలని షర్మిల డిమాండ్ చేశారు. నిజాలు నిగ్గు తేల్చాలని, దోషులు ఎవరో తేల్చాలన్నారు.