కేబినెట్ లో లంబాడీలకు స్థానం కల్పించాలి
NEWS Mar 26,2025 06:50 pm
మంత్రివర్గ విస్తరణలో లంబాడీల సామాజిక వర్గానికి చోటు కల్పించాలని కోరారు కాంగ్రెస్ పార్టీ లంబాడీ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ,కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి లకు లేఖలు రాశారు. రాష్ట్రంలో 32 లక్షల జనాభా ఉన్న లంబాడీలకు ప్రాతినిధ్యం అంటూ లేకుండా పోయిందని వాపోయారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డిని కలిసి విన్నవించారు.