అసెంబ్లీ సాక్షిగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఉగాది పర్వదినం సందర్బంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించనుందని తెలిపారు. రేషన్ కార్డు దారులకు 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇస్తామన్నారు. సభ్యుల సలహాలు, సూచనలు తీసుకుంటామన్నారు. అంతే కాకుండా బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు కూడా ఇస్తామన్నారు. సన్న బియ్యం స్కీమ్ తో 84 శాతం పేదలకు లబ్ది చేకూరుతుందన్నారు.