కొణతం రూ. 18.50 కోట్ల ఖర్చుపై విచారణ జరగాలి
NEWS Mar 26,2025 04:54 pm
మాజీ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ రెడ్డి వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆర్టీఐ ద్వారా ఈ వివరాలు బయటకు వచ్చాయి. ప్రభుత్వ సొమ్ముతో గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో విదేశీ పర్యటనల నిమిత్తం ఏకంగా రూ. 18.50 కోట్లు ఖర్చు చేశారని తేలింది. దీనిపై విచారణ జరగాలని తెలంగాణవాదులు కోరుతున్నారు. ఆయన పర్యటన వల్ల తెలంగాణకు ఏం ఒరిగిందో చెప్పాలంటున్నారు. రాష్ట్రానికి పెట్టబడులు వచ్చాయా , అమెరికా, బ్రిటన్, స్విట్జర్లాండ్ పర్యటనతో రాష్ట్ర యువతకు ఉద్యోగాలు వచ్చాయా అని ప్రశ్నిస్తున్నారు. దిలీప్ రెడ్డి కేటీఆర్ అనుచరుడిగా ఉన్నారు.