ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డి మంచోడు కాబట్టి మీరు ఇంకా ఫామ్‌హౌస్‌లో ప్రశాంతంగా ఉన్నారని కేసీఆర్ ఫ్యామిలీనీ ఉద్దేశించి అన్నారు. లేకపోతే నిన్నటి దాకా ఒక లెక్క, ఇప్పుడో లెక్క అన్నట్లు ఉండేదన్నారు. తప్పుడు నిర్ణయాలు తీసుకుని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆరోపించారు. పోలీసు అధికారులు కూడా వీరి అధికార దాహానికి బలయ్యారని వాపోయారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలన అధికార దుర్వినియోగానికి ఉదాహరణ అని అన్నారు. ఇప్పుడు నీతులు వల్లించడం విడ్డూరంగా ఉందన్నారు.