కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. లోక్ సభ స్పీకర్ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికార, ప్రతిపక్ష పార్టీలను స్పీకర్ సమానంగా చూడాలన్నారు. సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతున్న సమయంలో స్పీకర్ సభను వాయిదా వేయడం పట్ల మండిపడ్డారు. నోట్ల కట్టల వ్యవహారంలో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై ఎంక్వయిరీ జరగాలంటూ కాంగ్రెస్ వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చిందన్నారు. వాయిదా తీర్మానాన్ని కాదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రీజుజు కర్ణాటకలో ముస్లిం రిజర్వేషన్ పై చర్చ చేపట్టడానికి స్పీకర్ అంగీకరించారని ఆరోపించారు.