బెట్టింగ్ యాప్స్ పై ఉక్కుపాదం
NEWS Mar 26,2025 03:27 pm
సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. అసెంబ్లీ సాక్షిగా ఆయన బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై స్పందించారు. ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్, రమ్మీ గేమ్స్ పై కఠినంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇందు కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు.కఠిన శిక్షలు విధించేలా చట్టంలో సవరణలు తీసుకొస్తామన్నారు. ఇప్పటికే యూట్యూబర్స్, సినీ నటులతో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్యూయర్స్ మొత్తం 25 మందిపై కేసు నమోదు చేశారని చెప్పారు. ఎవరినీ వదిలి పెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు సీఎం.