'మై ఆటో ఈజ్ సేఫ్' QR అందించిన ఎస్పీ
NEWS Mar 26,2025 02:06 pm
మెట్‌పల్లి పట్టణంలో 'మై ఆటో ఈజ్ సేఫ్' కార్యక్రమంలో QR కోడ్ స్టికర్‌లను ఆటో డ్రైవర్లకు అందించారు ఎస్పీ అశోక్ కుమార్. ప్రయాణికులు QR కోడ్‌ను స్కాన్ చేయగానే ఆటో డ్రైవర్‌తో పాటు ఓనర్‌కు సంబంధిత వివరాలు వస్తాయని, ప్రయాణికులు సురక్షిత ప్రయాణం చేయవచ్చని ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో ఎంవీఐ శ్రీనివాస్, డీఎస్పీ రాములు, సీఐ అనిల్ కుమార్, ఎస్సైలు కిరణ్, అనిల్, రాజు పాల్గొన్నారు.