మాజీ సీఎం బాఘేల్ ఇళ్లపై సీబీఐ దాడులు
NEWS Mar 26,2025 12:15 pm
కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం భూపేశ్ బాఘేల్ కు సీబీఐ ఝలక్ ఇచ్చింది. ఆయనకు సంబంధించిన రాయ్ పూర్, భిలాయ్ లోని పలు ప్రాంతాలలో దాడులు చేపట్టింది. భిలాయ్ ఎమ్మెల్యే దేవేంద్ర యాదవ్, సీనియర్ పోలీసు అధికారులు, విద్యా రంగ ప్రముఖులు, బాఘేల్ ఓఎస్డీతో సహా అధికారుల ఇళ్లపై ఈ దాడులు కొనసాగుతున్నాయి. దీనిపై ఇంకా స్పందించలేదు ఏఐసీసీ. ఇదంతా కక్ష సాధింపులో భాగంగా జరుగుతోందంటూ మండిపడ్డారు మాజీ సీఎం బాఘేల్.