సీఎం రేవంత్ కొడంగల్‌కా? రాష్ట్రానికా?
NEWS Mar 26,2025 10:15 am
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. అసెంబ్లీ సాక్షిగా సర్కార్ అనుసరిస్తున్న విధానాలను తప్పు పట్టారు. విద్యా రంగాన్ని గాలికి వదిలి వేశారని ఆరోపించారు. విద్యా వాలంటీర్లు తక్కువగా ఉన్నారని కోడంగల్ లో నియమించారని, రాష్ట్రంలో మరెక్కడా ఎందుకు నియమించడం లేదంటూ ప్రశ్నించారు. అసలు సీఎంగా ఉన్నది కోడంగల్ కా లేక రాష్ట్రానికా అన్న అనుమానం కలుగుతోందన్నారు. 257 గ్రామ పంచాయితీల్లో స్కూళ్లు లేవన్నారు. ఎందుకు లేవో, నివేదిక తెప్పించుకొని చర్యలు తీసుకోవాలని కోరారు.