మల్లన్న సన్నిధిలో ఉగాది మహోత్సవాలు
NEWS Mar 26,2025 08:43 am
కోట్లాది భక్తుల కొంగు బంగారంగా పేరు పొందిన శ్రీశైల మహా పుణ్యక్షేత్రం భక్త బాంధవులతో కిటకిటలాడుతోంది. కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి భక్తులు పోటెత్తారు. ఎక్కడ చూసినా శివ నామ స్మరణతో మారుమ్రోగుతోంది నల్లమల. మార్చి 27 గురువారం నుంచి శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు ఈవో. ఈ ఉత్సవాలు మార్చి 31వ తేదీ వరకు 5 రోజుల పాటు కొనసాగుతాయన్నారు. స్వామి, అమ్మ వార్లకు వాహన సేవలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు.