ప్రజా శాంతి పార్టీ చీఫ్ డాక్టర్ కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, రిలయన్స్ కంపెనీ చీఫ్ అంబానీలను ఏకి పారేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ తో లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారని ఆరోపించారు. ఒక్క తెలంగాణలో వీటి బారిన పడి 978 మంది ఆత్మహత్య చేసుకున్నారని వాపోయారు. ఈ యాప్స్ వల్ల అంబానీ కోట్లు వెనకేసుంటున్నాడని మండిపడ్డారు. 25 మంది సెలబ్రిటీలపై కేసులు నమోదు చేసినందుకు పోలీసులను అభినందించారు. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసి 24 గంటల్లో వదిలి వేసినట్లు వీళ్లను వదల వద్దన్నారు కేఏ పాల్.