రాష్ట్రంలో నీటి కొరత లేకుండా చూడాలి
NEWS Mar 25,2025 04:54 pm
వేసవి తీవ్రత, నీటి ఎద్దడిపై సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఎక్కడా నీటి కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎండ తీవ్రత, హీట్ వేవ్స్ కు సంబంధించి మొబైల్ అలర్ట్ ఇవ్వాలన్నారు. ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. చలి వేంద్రాల్లో మజ్జిగ, తాగు నీటి పంపిణీ నిరంతరం జరగాలన్నారు. స్కూళ్లలో వాటర్ బెల్ తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. విద్యార్థులకు తాగు నీటికి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు.