స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తాను చేసిన కామెంట్స్ ను వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు. తనకు ఎనిమిది అక్కా చెల్లెళ్లు ఉన్నారని అన్నారు. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిని ఉద్దేశించి తాను కించ పర్చేలా అనలేదన్నారు. రన్నింగ్ కామెంటరీ చేయొద్దని మాత్రమే చెప్పానన్నారు. ఇదే సమయంలో కోనోకార్పస్ చెట్లు తొలగించాలన్నారు. హరిత హారంలో భాగంగా 200 కోట్ల మొక్కలు బీఆర్‌ఎస్ వాళ్లు నాటారని ఆరోపించారు. వీటిలో కోనోకార్పస్ మొక్కలు హానికరంగా ఉన్నాయన్నారు. వెంటనే తొలగించాలని స్పష్టం చేశారు.