రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు నిరసన చేపట్టారు. లాయర్లపై దాడులు ఆపాలని, అడ్వొకేట్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీని ముట్టడించేందుకు పిలుపునిచ్చారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గన్‌పార్క్ వద్ద అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. లాయర్లకు రక్షణ కల్పించాలని కోరారు. లేకపోతే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.