సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ నిప్పులు చెరిగారు. ఢిల్లీలో జడ్జి యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు బయట పడడం పట్ల స్పందించారు. న్యాయ వ్యవస్థపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఒత్తిడి పెరుగుతోందన్నారు. బీజేపీకి అనుకూలంగా వ్యవహరించే జడ్జీలు ఉన్నత పదవులకు వెళ్తున్నారని ఆరోపించారు. న్యాయ వ్యవస్థకు కళంకంగా జస్టిస్ వర్మ డబ్బుల కట్టల వ్యవహారం చోటు చేసుకుందన్నారు. వర్మ అవినీతికి పాల్పడ్డారని అనడానికి బయటపడ్డ నోట్ల కట్టలే నిదర్శనమన్నారు. వర్మను హైకోర్టు ఎంట్రన్స్ ముందు సోఫాలో కూర్చోబెట్టి పని ఇవ్వకుండా పనిష్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.