తెలంగాణలో పార్టీ ఫిరాయింపునకు పాల్పడిన ఎమ్మెల్యే కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు సీరియస్ కామెంట్స్ చేసింది. కౌంటర్ దాఖలకు ప్రతివాదులు సమయం కోరారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆలస్యం చేసే ఎత్తుగడలను అనుసరించ వద్దంటూ మండిపడింది. ఫిర్యాదు వచ్చి ఎన్ని రోజులు అవుతోందంటూ ఫైర్ అయ్యింది. నాలుగు వారాలైనా షెడ్యూల్ ఫిక్స్ చేయలేదా అంటూ నిప్పులు చెరిగింది. ప్రధానంగా ఒక బాధ్యతా యుతమైన పదవిలో ఉన్న స్పీకర్ ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించింది. సమాచారంతో కూడిన అఫిడవిట్ దాఖలు చేయక పోవడం విడ్డూరంగా ఉందని పేర్కొంది.