ఏపీలోనే పెట్రోల్..డీజిల్ ధరలు ఎక్కువ
NEWS Mar 25,2025 12:49 pm
ఏపీలో డీజిల్, పెట్రోల్ ధరలు తడిసి మోపడవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఏఐసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. రాష్ట్రంలో ఇవ్వాళ పెట్రోల్ ధర రూ. 109.60 పైసలు. డీజిల్ ధర రూ 97.47 పైసలు ఉందన్నారు. పక్కనున్న తమిళనాడు రాష్ట్రంలో లీటరు పెట్రోల్ ధర రూ.100.86 పైసలు. డీజిల్ ధర రూ.92.39 పైసలు అమ్ముతున్నారని పేర్కొన్నారు. తమిళనాడుతో పోల్చితే మన దగ్గర పెట్రోల్ మీద 9 రూపాయలు, డీజిల్ మీద 5 రూపాయలు ఎక్కువగా ఉందన్నారు. కర్ణాటకలో లీటరు పెట్రోల్ ధర రూ.102.90 పైసలు. డీజిల్ ధర రూ.88.99 పైసలు ఉందని, కర్ణాటకతో పోల్చితే ఏపీలో పెట్రోల్ మీద లీటరుకు 7 రూపాయలు, డీజిల్ మీద 9 రూపాయలు ఎక్కువగా ఉందని చంద్రబాబు ఏం చేస్తున్నారంటూ మండిపడ్డారు.