పెద్దపల్లి జిల్లా కేంద్రం లోని బంగారు దుకాణంలో అర్దరాత్రి దొంగలు పడ్డారు. రూ. 40 వేల నగదుతో పాటు 10 తులాల బంగారాన్ని దొంగలు దోచుకెళ్లారు. షాపు తాళాలు ధ్వంసం చేశారు. ఉదయం షాపు తెరిచేందుకు వచ్చారు యజమాని కరుణాకర్. షాపు తెరిచి ఉండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు షాపును పరిశీలించారు..కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.