ఉద్యోగుల పెండింగ్ బిల్లులు క్లియర్
NEWS Mar 25,2025 10:02 am
ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది. గత జగన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో పేరుకు పోయిన బకాయిలను క్లియర్ చేస్తున్నట్లు ప్రకటించింది. పెండింగ్ లో ఉన్న రూ. 1000 కోట్ల ఏపీజీఎల్ఐ బిల్లులు క్లియర్ చేసింది. రూ. 2,500 కోట్ల జీపీఎఫ్ బకాయిలను కూడా వారి ఖాతాల్లో జమ చేస్తోంది ఆర్థిక శాఖ. కాగా రూ. 2,300 కోట్ల సీపీఎస్ కంట్రిబ్యూషన్ మొత్తం క్రెడిట్ చేయడం పట్ల ఏపీఎన్జీఓ సంఘం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపింది.