సచిన్..విరాట్..షారుక్ లపై ఫిర్యాదు
NEWS Mar 25,2025 09:54 am
బెట్టింగ్ యాప్స్ వ్యవహారం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు 25 మంది సినీ రంగానికి చెందిన నటులు, యూట్యూబర్స్, ఇన్ ఫ్యూయన్సర్స్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా వీరి జాబితాలో చేరారు నటుడు షారుక్ ఖాన్, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో అర్జున్ గౌడ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఈ ముగ్గురు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోషన్ చేశారని, వీరిని నమ్మి చాలా మంది డబ్బులు కోల్పోయారని ఆరోపించారు. చిన్న వాళ్లనే కాదు పెద్ద యాడ్స్ చేసి కోట్లు సంపాదించే వారిపై కూడా కేసులు నమోదు చేయాలని కోరారు.