ఏపీ కూటమి సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ సీఎం జగన్ రెడ్డి. ఓ వైపు అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్ట పోయినా పట్టించు కోవడం లేదన్నారు. నెల కిందట రూ. 26 వేలు పలికిన అరటి ఇవాళ రూ. 9 వేలు కూడా పలకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అరటి మాత్రమే కాదు ఏ పంట అయినా ఇలాగే ఉందన్నారు. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలైమందని ఆరోపించారు. రైతుల వద్ద నుంచి కేజీ మిర్చిని కూడా కొనుగోలు చేయక పోవడం పట్ల మండిపడ్డారు.