శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.45 కోట్లు
NEWS Mar 25,2025 03:37 am
పుణ్యక్షేత్రం భక్త బాంధవులతో కిటకిటలాడుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 58 వేల 358 మంది దర్శించుకున్నారు. 27 వేల 24 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.45 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు ఈవో జె. శ్యామల రావు. ప్రస్తుతం ఏటీజీహెచ్ వరకు భక్తుల క్యూ లైన్ కొనసాగుతోందని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు 18 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.