ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్నారు. జగిత్యాల జిల్లా వర్శకొండ గ్రామానికి చెందిన గట్టు హరిణికి రూ.2 లక్షల 50 వేలు, మేడిపల్లి మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన దత్తు కు రూ .1 లక్ష 50 వేలను అత్యవసర చికిత్స నిమిత్తం ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ కు ధన్యవాదాలు తెలిపారు బాధిత కుటుంబీకులు. జిల్లా మున్నూరు కాపు అధ్యక్షులు సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు ఆది శ్రీనివాస్ కు.