నోట్ల కట్టల వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్ యశ్వంత్ వర్మకు బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ హైకోర్టు తనపై వేటు వేస్తున్నట్లు ప్రకటించింది. వర్మను విధుల నుంచి తప్పిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవలే జస్టిస్ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇంట్లో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు బయట పడ్డాయి. ఈ విషయాన్ని అగ్ని ప్రమాదక అధికారులు గుర్తించారు. దీనిపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. రాజ్యసభలో కూడా చర్చ జరిగింది. ఇంతలోనే దాచి పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో వేటు వేయక తప్పలేదు.